ఆసియా కప్ 2022: పాక్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
- August 29, 2022
దుబాయ్: ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో భారత్ బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది. 5 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది భారత్. పాక్ నిర్దేశించిన 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. బౌలింగ్ లో మెరిసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లోనూ చెలరేగాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.
పాండ్య 17 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లి (34 బంతుల్లో 35 పరుగులు), రవీంద్ర జడేజా(29 బంతుల్లో 35 పరుగులు) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 18 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ(18 బంతుల్లో 12 పరుగులు) చేశారు. కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు.
భారత బౌలర్ల మాదిరే పాక్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో మనోళ్లు పరుగులు చేయడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే జడేజా, పాండ్యలు రాణించడంతో భారత్ గెలుపొందింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్ 3 వికెట్లు, నసీమ్ షా 2 వికెట్లు తీశారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







