దుబాయ్‌లో ఏవియేషన్ కోర్సులకు భారీగా పెరిగిన డిమాండ్
- August 30, 2022
యూఏఈ: ఎమిరేట్స్ ఏవియేషన్ యూనివర్శిటీకి దరఖాస్తులు ప్రీ-పాండమిక్ స్థాయికి దాదాపు రెట్టింపు అయ్యాయి. విమానయాన రంగంలో నియామకాలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎమిరేట్స్ ఏవియేషన్ ఇండస్ట్రీ (EAU) వైస్ ఛాన్సలర్ డాక్టర్ అహ్మద్ అల్ అలీ మాట్లాడుతూ.. విమానయాన పరిశ్రమలో నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉపాధికి భారీ అవకాశాలను సృష్టించిందన్నారు. ఈ సంవత్సరం EAUకు దాదాపు 3,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. 2019- 2020 విద్యా సంవత్సరానికి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం దాదాపు రెట్టింపు దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు. ఏవియేషన్ కోర్సులకు దుబాయ్‌లో ఇంత భారీ డిమాండ్ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని డాక్టర్ అల్ అలీ అన్నారు. దుబాయ్‌లో నాలుగు ప్రధాన విమానయాన సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని, ఇది కూడా డిమాండ్ పెరిగేందుకు కారణం అని ఆయన పేర్కొన్నారు. బోయింగ్ ఇటీవల విడుదల చేసిన పైలట్, టెక్నీషియన్ ఔట్‌లుక్.. రాబోయే 20 సంవత్సరాలలో 2 మిలియన్లకు పైగా కొత్త విమానయాన సిబ్బందికి డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది. అదే సమయంలో మిడిల్ ఈస్ట్‌లో 200,000 పైలట్లు, సాంకేతిక నిపుణులు, క్యాబిన్ సిబ్బంది అవసరం ఉంటుందని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







