అయ్యో పాపం.! రష్మిక ఆ క్రేజీ ఆఫర్ అలా కోల్పోయిందా.?

- August 30, 2022 , by Maagulf
అయ్యో పాపం.! రష్మిక ఆ క్రేజీ ఆఫర్ అలా కోల్పోయిందా.?

రష్మిక మండన్నా టాలీవుడ్‌లో నెంబర్ వన్ ఛైర్‌ని దాదాపు ఆక్యుపై చేసేసినట్లే. ఇప్పుడు తెలుగుతో పాటూ, తమిళ, హిందీ సినిమాల్లోనూ రష్మిక హవా చూపిస్తోంది. 

హిందీ విషయానికొస్తే, సినిమాల్లో సందడి చేయకముందే, ‘టాప్ టక్కర్..’ అంటూ ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించి పిచ్చ క్రేజ్ దక్కించుకుంది రష్మిక మండన్నా. ఇక, ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకెళ్లిపోతోంది. మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది రష్మిక హిందీలో.

కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయ్ కూడా. ఇక, లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, బాలీవుడ్ యంగ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్‌తో రష్మిక ‘స్ర్కూ ఢీలా’ అనే ఓ సినిమాకి సైన్ చేసింది. ఈ సినిమా కోసం టైగర్ ష్రాఫ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. 

కరణ్ జోహార్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే, ప్రస్తుతం బాలీవుడ్ దారుణమైన క్రైసిస్‌ని ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెమ్యునరేషన్ విషయంలో కరణ్ జోహార్‌కీ, టైగర్ ష్రాఫ్‌కీ మధ్య చిన్న విబేధాలు రావడంతో, ఈ సినిమా ఆగిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. 

మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ఒకవేళ సినిమా ఆగిపోతే, క్రేజీ ఆఫర్ రష్మిక చేయి జారిపోయినట్లేగా. నెట్టింట జోరుగా హోరెత్తిపోతున్న ఈ ప్రచారానికి రష్మిక ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి మరి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com