పవన్ పుట్టిన రోజు హంగామా.! ఆ రోజే హరి హర వీరమల్లు కొత్త అప్‌డేట్.!
- August 30, 2022
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్లు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ‘జల్సా’ సినిమాని 4 కె ఫార్మేట్‌లోకి మార్చి రిలీజ్ చేస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించారు అభిమానులు.

ఇక, ఇప్పుడు అభిమానులకు మరో గుడ్ న్యూస్ రానుంది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’ నుంచి ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ రిలీజ్ చేయనున్నారట. ఖచ్చితంగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేసే సర్‌ప్రైజ్ అవుతుందని అంటున్నారు.
దాంతో నిజంగానే పవన్ అభిమానులు ఖుషీ చేసుకుంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మొగలాయిల కాలం నాటి కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాలో రకరకాల మల్లయుద్ధాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ పోరాట ఘట్టాలకు సంబంధించిన ఫోటోలు గతంలోనే రిలీజై వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక, లేటెస్టుగా ఈ సినిమా నుంచి రాబోయే అప్‌డేట్ ఎలా వుండబోతోందో అంటూ పవర్ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ తెగ పెరిగిపోతోంది.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







