వర్మ కొత్త సినిమా 'రాయ్'
- April 15, 2016
వివేక్ ఒబెరాయ్ కథానాయకుడిగా 'రాయ్' అనే టైటిల్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మే 1న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత ఈ చిత్రానికి సుదీప్‌ని అనుకున్నామని... కొన్ని కారణాల వల్ల వివేక్‌తో తీస్తున్నామన్నారు.
మంగళూర్, బెంగళూర్, ముంబయి, దుబాయ్, లండన్‌లో ఈ చిత్రం చిత్రీకరణ జరగనున్నట్లు పేర్కొన్నారు. డాన్ నుంచి కార్యకర్తగా మారిన ముత్తప్ప రాయ్ తన కోరిక మేరకు మే 1న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి అంగీకరించారని, ఆ రోజు ఆయన పుట్టినరోజని తెలిపారు. సీఆర్ మనోహర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మొత్తం నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







