ఆసియా కప్-2022: నేడు భారత్, హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్..
- August 31, 2022
దుబాయ్: ఆసియా కప్-2022లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం విధితమే. గెలుపు ఉత్సాహంతో టోర్నీలో అత్యంత బలహీనమైన జట్టు, క్వాలిఫయర్స్ ద్వారా ఆసియా కప్ కు అర్హత సాధించిన హాంకాంగ్ ను రోహిత్ సేన నేడు ఢీకోబోతుంది. ఈ క్రమంలో భారీ విజయంపై టీమిండియా గురిపెట్టింది.
గ్రూప్-ఏలో పాక్‌పై విజయం సాధించిన భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా హాంకాంగ్ ను ఢీకోనుంది. హాంకాంగ్ పై ఆడే జట్టులో రిషిబ్ పంత్ కు అవకాశం ఇస్తుందా? ఒకవేళ రిషిబ్ పంత్ ను తీసుకుంటే కేఎల్ రాహుల్ ను పక్కన పెడతారా? దినేష్ కార్తీక్ ను పక్కకు పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనింగ్ భాగస్వామ్యం ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రాహుల్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. మరోవైపు పాక్ తో మ్యాచ్ లో రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్ కు టీం మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది.
హాంకాంగ్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో టీమిండియా జట్టులో పలు మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. రిషిత్ పంత్ ను జట్టులోకి తీసుకొని రాహుల్, దినేష్ కార్తీక్ లలో ఒకరిని పక్కకు పెడతారని తెలుస్తోంది. మరోవైపు ఓపెనింగ్ విభాగంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకోని పక్షంలో రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీని ఓపెనర్ గా పంపిస్తే ఎలాఉంటుందనే విషయంపై టీం మేనేజ్మెంట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక బౌలింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేకుండానే హాంకాంగ్‌తో జరిగే మ్యాచ్ కు తుదిజట్టును ఫైనల్ చేసే అవకాశాలుఉన్నాయి. మొత్తానికి పసికూనతో జరిగే మ్యాచ్ లో భారీ విజయంపై కన్నేసిన టీమిండియా బ్యాటింగ్ విభాగంలో స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







