భారత్ కరోనా అప్డేట్
- September 01, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో రోజువారీ కరోనా కేసులు పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 7,946 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.మరో 37 మంది మరణించారు. ఒక్కరోజులో 9,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో బుధవారం 12,90,443 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,12,52,83,259 కు చేరింది. ఒక్కరోజే 2,66,477మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 652,816 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,942 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 607,922,595కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్తో 6,495,689 మంది మరణించారు.శనివారం మరో 834,638 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 584,030,694కు చేరింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







