పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపించేందుకు తీసుకోవలసీన జాగ్రత్తలూ
- April 15, 2016
పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపించేందుకు అప్పుడప్పుడూ పెడిక్యూర్ చేయించుకోవడం ఒక్కటే కాదు, కొన్ని సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే అదనంగా కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అవేంటంటే.. స్నా నం చేసేప్పుడు కేవలం పాదాలు మాత్రమే కాదు, వాటి వేళ్ల మధ్యా, అరిపాదాల్లో మురికీ, మట్టి లేకుండా శుభ్రం చేసుకోవాలి. కుదిరితే అప్పుడప్పుడు మెత్తని తడి వస్త్రంతో పాదాలనూ, వేళ్లమధ్యా తుడుచుకుంటున్నా మంచిదే. ఆ తరవాత కూడా పాదాలు శుభ్రంగా ఆరిపోయేలా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలం ఏదయినా సరే.
. పాదాల నుంచి దుర్వాసన రావడం,్ల బ్యాక్టీరియా, ఫంగస్ పేరుకోవడం లాంటి సమస్యలు ఉండవు.
* తరచూ పెడిక్యూర్ చేయించుకుంటున్నప్పుడు ప్రతిసారీ ఎప్సమ్ సాల్ట్‌ని వాడాలని లేదు. బదులుగా గోరువెచ్చని నీటిలో ఏదయినా లిక్విడ్ సోప్ వేసుకుంటే చాలు. అలాగే పెడిక్యూర్ తరవాత పాదాలు తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలి. పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. ఒకవేళ మీ పాదాల నుంచి దుర్వాసన వస్తుంటే మాత్రం.. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి.. అందులో కాసేపు పాదాలను ఉంచండి.
* ఎప్పుడూ ఒకే తరహా చెప్పులు లేదా బూట్లు వేసుకోవడం సబబు కాదు. తరచూ మారుస్తుండాలి. అప్పుడే పాదాలకు గాలి చేరి ఆరోగ్యంగా ఉంటాయి. చెప్పులు ఎంత అందంగా కనిపిస్తున్నా సరే.. ఏ మాత్రం బిగుతుగా పట్టేసినట్లు అనిపిస్తున్నా వేసుకోకపోవడమే మంచిది. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే అరిపాదాలు నొప్పి పుడతాయి. అలాగే ఎత్తుమడమల చెప్పులు కూడా వీలైనంతవరకూ రెండు అంగుళాలకు మించి ఎంచుకోకపోవడం మంచిది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









