ధూమపాన నిషేధ చట్టం.. ఉల్లంఘనకు KD 5,000 జరిమానా
- September 01, 2022
కువైట్: క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధ చట్టం కేవలం పొగాకు సిగరెట్లకు మాత్రమే కాదని.. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కా (షిషా), ఇతర ఉపకరణాలకు కూడా వర్తిస్తుందని ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ (ఈపీఏ) అధికారిక ప్రతినిధి షేఖా అల్-ఇబ్రహీం స్పష్టం చేశారు. పొగాకు నియంత్రణ చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈపీఏ పలు వీడియోలను రూపొందించిందని, వాటితో అవగాహన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు షేఖా అల్-ఇబ్రహీం తెలిపారు. బహిరంగ ప్రదేశాల ఎంగ్రన్స్ ల వద్ద నిర్దిష్ట ప్రదేశాలలో "నో స్మోకింగ్" బోర్డులు పెట్టాలన్నారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే ఫెసిలిటీ మేనేజర్‌కి KD 5,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ- ప్రైవేట్ పరిపాలనా సంస్థలు, ప్రజా ప్రయోజన సంఘాలు, వాటి పరిపాలనా కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు కూడా పొగాకు నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







