క్వారంటైన్ నిబంధన తొలగించిన ఖతార్
- September 02, 2022
దోహా: విదేశాల నుంచి ఖతార్‌కు వచ్చే టూరిస్టులు ఇకపై హోటల్ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వారికి మాత్రం పాత నిబంధనలే అమలు కానున్నాయి. ఈ మేరకు ట్రావెల్ అండ్ రిటర్న్ పాలసీని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MoPH) అప్‌డేట్ చేసింది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 4 నుంచి అమల్లోకి రానుంది. కొత్త అప్‌డేట్ ప్రకారం.. ఖతార్‌లోకి వచ్చే ప్రయాణికులు ముందస్తు, వచ్చిన తర్వాత COVID-19 పరీక్షలు తప్పనిసరి. పౌరులు, నివాసితులు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్పొరేషన్ ఆరోగ్య కేంద్రం లేదా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రైవేట్ మెడికల్ సెంటర్‌లో ఖతార్‌కు చేరుకున్న తర్వాత 24 గంటల వ్యవధిలో రాపిడ్ యాంటిజెన్ పరీక్ష (RAT) చేయించుకోవాలి. అలాగే ఖతార్‌కు వచ్చేముందు 48 గంటలలోపు చేయించుకున్న పీసీఆర్ (PCR) టెస్ట్ సర్టిఫికేట్ లేదా 24 గంటలలోపు అయితే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)ని తీసుకురావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







