బర్త్‌డే స్పెషల్: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘పవర్’ గ్లాన్స్.!
- September 02, 2022
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హరవీరమల్లు’ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ‘పవర్ గ్లాన్స్’ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఓ ఊపు ఊపేస్తోంది.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గత కొన్ని రోజులుగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు అభిమానులు. ఆయన సూపర్ హిట్ సినిమాల్ని రీ రిలీజ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
ఇక, తాజాగా వచ్చిన ‘హరి హర వీరమల్లు’ టీజర్‌తో పవన్ ఫ్యాన్స్‌లో కొత్త హుషారు నెలకొంది. టీజర్ విషయానికి వస్తే, ఓ యాక్షన్ బిట్ కట్ చేశారు. చాలా పవర్ ఫుల్‌గా వుంది. మల్ల యుద్ధ యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే.
ఆ బ్యాక్ డ్రాప్లోనే టీజర్ కట్ చేశారు. ‘మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కి తెచ్చి తొడకొట్టాడో తెలుగోడు..’ అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో ఈ టీజర్ స్టార్ట్ అయ్యింది. ఇంతకు ముందున్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తొడకొట్టాడు.
అలాగే టీజర్ చివర్లో తీక్షణమైన చూపులతో మీసం తిప్పుతూ నడిచొస్తున్న కొదమసింహంలా కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పీరియాడికల్ ఫిక్షనల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







