అవునా.! సమంత అలాంటి నిర్ణయం తీనుకోనుందా.?
- September 02, 2022
టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ సహా సమంతకు పాపులారిటీ వుంది. ప్రధానంగా తెలుగు, తమిళ భాషల్లో సమంత స్టార్ హీరోయిన్. ఈ మధ్యనే హిందీలోనూ పాపులర్ అయ్యింది. ‘ది ప్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ హిందీ ఆడియన్స్ సమంత గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఇక, ప్రస్తుతం హిందీలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో బిజీగా వుండడమే కాదు, అక్కడి ప్రముఖులందరితోనూ స్నేహంగా మెలుగుతోంది సమంత. అలాగే ‘ఆరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే సినిమాతో త్వరలో హాలీవుడ్‌నీ టచ్ చేయబోతోంది సమంత.
అయితే, సమంత తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇంతకీ ఆ షాకింగ్ నిర్ణయం ఏంటంటారా.? ఇకపై సమంత గ్లామర్ రోల్స్ జోలికి పోదట. తన పాత్రకు ప్రాధాన్యత వున్న క్యారెక్టర్లనే ఎంచుకుంటుందట. ఆ మాటకొస్తే కథా ప్రాధాన్యత వున్న సినిమాలకే సైన్ చేస్తుందట.
ఇప్పుడే సమంత ఆ తరహా పాత్రలనే ఎంచుకుంటోంది. ఆమె నటించే సినిమాలు కూడా ఆ తరహాలోనివే. తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషీ’ సినిమాలు ప్రధానంగా సమంత చుట్టూ తిరిగే కథలే కావడం విశేషం. అలాగే, ఇతర భాషల్లోనూ ఆ ఫార్మేట్‌నే ఫాలో అవుతోందట సమంత.
సమంత స్ర్కీన్ ముచ్చట సరే, మరి, సోషల్ మీడియా సంగతేంటో.! సోషల్ మీడియాలో విచ్చల విడి గ్లామర్‌తో సమంత రెచ్చిపోతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. మరి, ఈ నిర్ణయం సోషల్ మీడియాకి వర్తిస్తుందా.? లేదా.?
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







