‘రంగ రంగ వైభవంగా’ మూవీ రివ్యూ

- September 02, 2022 , by Maagulf
‘రంగ రంగ వైభవంగా’ మూవీ రివ్యూ

‘ఉప్పెన’, ‘కొండ పొలం’ లాంటి విలక్షణమైన సినిమాలు చేసిన పంజా వైష్ణవ్ తేజ్ నుంచి ఈసారి సరదాగా సాగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తోందనగానే, సినిమాపై ఒకింత ఆసక్తి కనిపించింది. వరుసగా రెండు సినిమాల ఫెయిల్యూర్స్ (‘రొమాంటిక్’, ‘లక్ష్య’) వచ్చినా, సమ్‌థింగ్ స్పెషల్ అనే గుర్తింపుని తెలుగు ప్రేక్షకుల్లో తెచ్చుకుంది కేతిక శర్మ. జోడీ పరంగానూ ఒకింత ఎక్కువే ఆసక్తి కనబరిచారీ జంట. మరి, ఈ జంట మధ్య కెమిస్ట్రీ అనుకున్నంతలా వుందో లేదో చూడాలంటే, ‘రంగ రంగ వైభవంగా’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
చిన్నప్పటినుంచీ రిషి (వైష్ణవ్), రాధ (కేతిక) మధ్య గిల్లికజ్జాలుంటాయ్. సిల్లీ కారణాలతో తరచూ గొడవ పడుతుంటారు.. మెడికల్ కాలేజీ విద్యార్థులైనా కూడా ఇద్దరి మధ్యా ఆ గొడవలు కొనసాగుతూనే వుంటాయి. పరస్పర భిన్న ధృవాలైన వైష్ణవ్, కేతిక మధ్య ఎలా ప్రేమ చిగురించింది.? ఇరు కుటుంబాల్లోనూ వీరి ప్రేమ సంబరాల్ని నింపిందా.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, సినిమాని తెరపై చూడాల్సిందే.
నటీనటుల పని తీరు..
ప్రచారం చేసినట్లుగానే వైష్ణవ్, కేతిక మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. జోడీ తెరపై చాలా క్యూట్‌గా కనిపించింది. వైష్ణవ్ సరదాగా సాగిపోయే సన్నివేశాల్లో బాగా మెప్పించాడు. కానీ, ఎమోషనల్ సీన్స్ వచ్చేసరికి ఇంకాస్త బెటర్‌గా చేసి వుంటే బావుండేదేమో అనిపిస్తుంది. డైలాగ్స్, డాన్సింగ్ స్కిల్స్ మీద వైష్ణవ్ ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సి వుంది. హీరోయిన్‌గా కేతికకు ఈ సినిమా బాగానే యూజ్ అయ్యిందని చెప్పొచ్చు. తన పాత్ర పరిధి మేరకు బాగానే మెప్పించింది. నవీన్ చంద్ర ఓకే. ఇంకాస్త బాగా అతని పాత్రను డిజైన్ చేసి వుండాల్సింది. సీనియర్ నటులు, నరేష్, ప్రభు ఓకే. వారిని సైతం దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అలీ కామెడీ, సెకెండాఫ్‌లో సత్య కామెడీ ఆకట్టుకుంటాయి.

సాంకేతికంగా సినిమా ఎలా వుందంటే..
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆహ్లాదంగా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ గత చిత్రాలు గుర్తుకొస్తుంటాయ్. షామ్‌దత్ సైనుదీన్ సినిమాటోగ్రఫీ చాలా కలర్‌ఫుల్‌గా వుంది. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు గిరీశాయ విషయానికొస్తే, చాలా పాత స్టోరీ లైన్ తీసుకున్నాడు. ఫస్టాఫ్ నేటి తరానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నా, సెకెండాఫ్ మాత్రం రెగ్యులర్ టెంప్లేట్‌లోనే వెళ్ళిపోయింది.

ప్లస్ పాయింట్స్..
ప్రధాన తారాగణం పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ
కొన్ని పాటలు

మైనస్ పాయింట్స్..
తేలికైన కథనం
కథ పరంగా కొన్ని లోపాలు
బలమైన ఎమోషనల్ సీన్స్ లేకపోవడం

విశ్లేషణ..
ఓవరాల్‌గా చూస్తే రంగ రంగ బైశంగా ఓ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా.. జస్ట్ టైమ్ పాస్ అనిపిస్తుంది ఫస్టాఫ్‌లో. సెకెండాఫ్ మాత్రం ఓల్డ్ ట్రీట్మెంట్‌తో కొంత విసుగు తెప్పిస్తుంది. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌కి వస్తే మాత్రం ఓకే గుడ్.. అనిపిస్తుంది. బలమైన ఎమోషన్స్, రేసీ స్క్రీన్ ప్లే వుంటే.. సినిమా రిజల్ట్ ఇంకా మెరుగ్గా వచ్చేందుకు ఉపయోగపడేది.!

చివరిగా: ‘రంగ రంగ వైభవంగా’ ఏమి వైభవంగా లేదు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com