ప్రమోషన్‌కే ‘మెగా’: రిజల్ట్ ధగా.! ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌కి గట్టి షాకే తగిలిందిగా.!
- September 03, 2022
‘జాతిరత్నాలు’ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనుదీప్, సినిమా సక్సెస్ అవ్వడంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇండస్ర్టీ దృష్టిని గట్టిగా ఆకర్షించేశాడు. వెంటనే రెండో సినిమాగా ‘ప్రిన్స్’ అనే సినిమాని పట్టాలెక్కించాడు. ఆ సినిమా అలా అలా నడుస్తుండగానే, తన సొంత కథతో తన అసిస్టెంట్‌ని డైరెక్టర్‌గా దించేశాడు. ఈయనే తప్పటడుగులు వేస్తున్న డైరెక్టర్. అలాంటిది మళ్లీ తన అసిస్టెంట్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేయడం అంటే అదో పెద్ద సాహసమే అనాలి.
ఇంతకీ మనోడు దించిన కొత్త డైరెక్టర్ చేసిన సినిమా ఏంటో తెలుసా.? ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. టైటిల్ బాగుంది. సినిమాకి ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో చేశారు. అదేనండీ ‘మెగా’ లెవల్లో చేశారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే తమ సినిమా ప్రమోషన్లకు పట్టుకొచ్చేశారు. ఈ సినిమా ఈవెంట్‌లో భాగంగానే కంటెంట్ రిచ్ మూవీస్ గురించీ, జనాలు ధియేటర్లకు రావడం గురించీ, అప్ కమింగ్ డైరెక్టర్ల టాలెంట్ గురించి. ఇలా పలు రకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి.
చిరంజీవి వ్యాఖ్యలయితే ఇండస్ర్టీలో సంచలనమయ్యాయనుకోండి. ఎందుకంటే ఆయన మెగాస్టార్. మరి, మనోడు అనుదీప్ సంగతేంటీ.? ఆయన బాధ్యత తీసుకున్న ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా సంగతేంటీ.? సినిమా టైటిల్‌లో వున్నట్లే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కే ధియేటర్ నుంచి లేచిపోయింది ఈ సినిమా. ‘జాతిరత్నాలు’ రేంజ్‌లో సినిమా హిట్ అవుతుందనుకున్నారు. కానీ, సీను రివర్స్ అయ్యింది. అనుదీప్ ‘జాతిరత్నాలు’ సినిమాతో తెచ్చుకున్న ఫేమ్ అంతా ఈ సినిమాతో పోగొట్టుకున్నట్లయ్యింది. మరి, ఆ ఫేమ్ మళ్లీ తిరిగి తెచ్చుకోవాలంటే, మనోడు నెక్స్‌ట్ ఏం చేస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







