‘బ్రహ్మాస్త్ర’ మేనియా మొదలైంది
- September 03, 2022
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న ఫాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. హిందీతో పాటూ, తెలుగు తదితర భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది. తెలుగులో జక్కన్న రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
కాగా ప్రస్తుతం బాలీవుడ్ సినిమా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హిందీ సినిమాలనే తెలుగు సినిమాలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు బాలీవుడ్ జనం. ఆ క్రమంలోనే ‘బ్రహ్మాస్త్ర’ బాధ్యతను రాజమౌళిపై వుంచినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 9న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. కానీ, హైద్రాబాద్‌లో గణేష్ నవరాత్రి వుత్సవాల హంగామా కారణంగా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయనీ, లాస్ట్ మినిట్‌లో ఈ ఈవెంట్‌ని పార్క్ హయత్ హోటల్‌కి మార్చారు.
అభిమానుల కోలాహలం మధ్య ఈవెంట్‌ని జరపలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాడు ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్జీయార్. కాగా, ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అంతా బాగానే వుంది. కానీ, ఎన్టీయార్, రాజమౌళి ‘బ్రహ్మాస్ర్ర’ని గట్టెక్కించగలరా.? ఈ మధ్య బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సొంత సినిమాలు దారుణంగా ఫెయిల్ అవుతున్నాయ్. మరి ఆ ఫెయిల్యూర్స్ నుంచి ‘బ్రహ్మాస్త్ర’ బాలీవుడ్‌ని ఆదుకుంటుందా.? లేదా.? ఇలాంటి అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయ్. అయితే, ప్రమోషన్స్‌లో రాజమౌళికి ఓ స్పెషల్ స్ర్టాటజీ వుంటుంది. మరి, ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో జక్కన్న స్ర్టాటజీ ఫలిస్తుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!