కొత్తగా ట్రైనింగ్ వీసాను తీసుకొచ్చిన NPRA
- September 04, 2022
మనామా: ఆరు నెలలపాటు చెల్లుబాటు అయ్యే ట్రైనింగ్ ప్రయోజనాల కోసం మల్టీ-ఎంట్రీ ఇ-వీసాను ప్రవేశపెట్టినట్లు జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు (NPRA) ప్రకటించింది. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని క్యాబినెట్ ప్రారంభించిన ఎన్పీఆర్ఏ సేవలు, ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికను మెరుగుపరచడానికి చేపట్టిన 24 కార్యక్రమాలలో ట్రైనింగ్ వీసా జారీ ఓ భాగంగా ఉందని ఎన్పీఆర్ఏ తెలిపింది. అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ.. వీసాను మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల వారు BD60 రుసుముతో www.evisa.gov.bh ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ట్రైనర్ లేదా ట్రైనీ కోసం వీసా జారీ చేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!