ఫ్యూయల్ స్టేషన్స్ కోసం మోటరిస్టుల విజ్ఞప్తి
- April 15, 2016
దోహాలోని ఎఫ్-రింగ్ రోడ్‌పై ప్రయాణించే వాహనదారులు ఫ్యూయల్ స్టేషన్ల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. అదనంగా స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యూయల్ సమస్యనుంచి తమకు ఉపశమనం కల్పించాలని వాహనదారులు కోరారు. శాశ్వతంగా ఏర్పాటు చేసే స్టేషన్లకన్నా ముందు మొబైల్ ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచిస్తున్నారు వాహనదారులు. ప్రతిరోజూ ఈ రోడ్డును వినియోగించే వాహనదారులు ఫ్యూయల్ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 15 నెలల క్రితమే ఎఫ్ రింగ్‌రోడ్ మీద వాహనాలకు అనుమతించారు. భారీ సంఖ్యలో నిత్యం ఈ రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ రోడ్డుని ఎక్కువగా వినియోగించే అల్ తుమామా ప్రాంత ప్రజలు, ఫ్యూయల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. బర్వా సిటీ మరియు మెసైమీర్ ప్రాంతాల్లోనివారికీ ఇదే సమస్య ఎదురవుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







