మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
- September 06, 2022
న్యూ ఢిల్లీ: పాకిస్థాన్ కు కాల్పుల విరమణ ఒప్పందాని ఉల్లంఘించడం పరిపాటిగా మారింది. జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు పొడవునా తూటాల మోత మోగించింది. పాక్ రేంజర్లు ఎలాంటి కవ్వింపులు లేకుండానే భారత సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లపై కాల్పులు జరిపారు.
ఇవాళ ఉదయం జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్ లో పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ దీటుగా జవాబిచ్చిందని బీఎస్ఎఫ్ డిప్యూటీ ఐజీ ఎస్పీఎస్ సంధు వెల్లడించారు. బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పాక్ దళాలు తుపాకీలకు పనిచెప్పాయని వివరించారు. అయితే, భారత్ వైపున ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని బీఎస్ఎఫ్ జమ్మూ ప్రాంత పీఆర్వో వెల్లడించారు.కాగా, గతంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ గతేడాది ఫిబ్రవరిలో భారత్, పాక్ ఓ అంగీకారానికి వచ్చాయి.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఓపెన్ హౌస్ హైలెట్స్..!!
- అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- 13,072 మంది ఉల్లంఘనదారులపై బహిష్కరణ వేటు..!!
- కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!
- ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!