గాడ్ ఫాదర్ నుండి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్
- September 08, 2022
హైదరాబాద్: గాడ్ ఫాదర్ నుండి నయనతార ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుండి హీరోయిన్ నయనతార తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానులను అలరింపజేశారు.
‘సత్య ప్రియ జయదేవ్’ అనే పాత్రలో నయనతార నటించనున్నారని పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్లో సంప్రదాయబద్దమైన కాటన్ చీరలో నయన్ కనిపించారు. టైప్ రైటర్‌పై ఏదో రాస్తునట్లుగా ఉన్న ఆ పోస్టర్‌ను చూసిన అభిమానులు ఈ పాత్రకు నయన్ కరెక్ట్ ఛాయిస్ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక రీసెంట్ గా నయనతార ..దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత ఆమె నటించనున్న ప్రాజెక్టుల్లో గాడ్ ఫాదర్ ఒకటి. ఈ మాస్ ఎంటటైనర్ మూవీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ , దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు సత్యదేవ్ సైతం ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







