దూర ప్రాంత ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త

- September 08, 2022 , by Maagulf
దూర ప్రాంత ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త

అమరావతి: దూర ప్రాంత ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ సర్వీసులకు సంబందించిన చార్జీలను 20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. అమరావతి, గరుడ ఏసీ సర్వీసుల ఛార్జీలను 20 శాతం తగ్గించగా, ఇంద్ర ఏసీ సర్వీసుకు పది శాతం ఛార్జీల్లో రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తగ్గింపు ధరలతో చూస్తే.. గుంటూరు నుంచి హైదరాబాద్‌ (ఎమ్‌జీబీఎస్‌)కు వెళ్ళే గరుడ ఏసీ సర్వీసు ఛార్జీ రూ. 820లు ఉండగా 20 శాతం తగ్గింపుతో రూ. 670 ఛార్జీ వసూలు చేయనున్నారు.

అలానే గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్ళాలనున్న గరుడ ఏసీ సర్వీసు ఛార్జీ రూ. 730 ఉండగా 20 శాతం రాయితీతో రూ. 640 వసూలు చేయనున్నారు. ఇక గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్ళనున్న ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ. 660 ఉండగా పది శాతం తగ్గింపుతో రూ. 600లు ఛార్జీ వసూలు చేయనున్నారు. అలాగే గుంటూరు నుంచి బెంగళూరు ఇంద్ర ఏసీ సర్వీసు గతంలో రూ. 1470 కాగా పది శాతం తగ్గింపుతో రూ. 1340 వసూలు చేయనున్నారు. గుంటూరు- తిరుపతి ఇంద్ర ఏసీ సర్వీసుకు కూడా రూ. 890 ఉన్న టిక్కెట్‌ ఛార్జీ పది శాతం తగ్గింపుతో రూ. 810 వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక తగ్గింపు ధరల నేపథ్యంలో ప్రయాణికుల ఆదరణ పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com