టీ20 ర్యాంకులను విడుదల చేసిన ఐసీసీ..
- September 08, 2022
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.కోహ్లీ నాలుగు స్థానాలు ఎగబాకి 29 స్థానంలో ఉన్నాడు.
మరోవైపు బ్యాటింగ్ జాబితాలో ఇప్పటివరకు నం.1 స్థానంలో కొనసాగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్థానం గల్లంతైంది. పాకిస్థాన్‌కే చెందిన మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో బాబర్ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన మార్‌క్రమ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ఐదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఏ భారత ఆటగాడు కూడా టాప్-10లో లేడు.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!