మలయాళంలో నిఖిల్ షేకింగ్స్ షురూ.!
- September 11, 2022
తెలుగు, హిందీ భాషల్లో ‘కార్తికేయ 2’ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. సొంత సినిమాలు దారుణంగా దెబ్బ తింటున్న బాలీవుడ్‌కి ‘కార్తికేయ 2’తో చిన్న రిలీఫ్ వచ్చిందనే చెప్పొచ్చు.
అలాగే, తెలుగులోనూ మంచి విజయం దక్కించుకుంది ‘కార్తికేయ 2’. ఇప్పుడీ సినిమాని మలయాళంలో రిలీజ్ చేయనున్నారట. సెప్టెంబర్ 23 నుంచి ఈ సినిమాని మలయాళంలో అందుబాటులోకి రానుందట. సో, మాలీవుడ్ ధియేటర్స్‌ని షేక్ చేసేందుకు ‘కార్తికయే 2’ రంగం సిద్ధం చేసుకుందన్న మాట.
నిఖిల్ సిద్దార్ధ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘కార్తికేయ 2’ సినిమా ఆగస్టు 13న రిలీజైన సంగతి తెలిసిందే. యూనిక్ సబ్జెక్ట్ కావడం వల్లనేమో ఈ సినిమాకి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కృష్ణ తత్వాన్ని అత్యద్భుతంగా చాటి చెప్పిన సినిమాగా ‘కార్తికేయ 2’ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ ధియేటర్లలో ‘కార్తికయే 2’ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టనుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!