అక్కినేని హీరోలకు బాలీవుడ్లో పెద్ద ఝలక్కే తగిలిందిగా.!
- September 11, 2022
అక్కినేని హీరో నాగ చైతన్య తొలిసారి బాలీవుడ్లో నటించిన సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు చైతూ. చిన్న పాత్రే అయినా ఎంతో ఇష్టపడి చేసిన పాత్రగా ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాలోని తన పాత్రను అభివర్ణించుకున్నాడు చైతూ.
అలాగే, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోతో తొలి సినిమాకే నటించే ఛాన్స్ దక్కించుకోవడం కూడా తన అదృష్టంగా చెప్పుకున్నాడు చైతూ.అంతగా అంచనాలు వేసుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చైతూ సంగతి అలా వుంటే, నాగార్జున సంగతి ఇంకోలా వుంది.
బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా రిలీజైన ఈ సినిమాకీ బాలీవుడ్లో గట్టి దెబ్బ తగిలింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ వచ్చేసింది ఈ సినిమాకి.
దాంతో డిజాస్టర్ లిస్టులోకి పోయింది ఈ సినిమా. ఇద్దరు అక్కినేని హీరోలూ బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూడడంతో, యాంటీ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి తెలుగు నుంచి స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శక దిగ్గజం రాజమౌళితో పాటూ ఎన్టీయార్ సైతం చేయందించినా పరిస్థితులు అనుకూలించలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ని అడ్డుకోలేకపోయారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..