బహ్రెయిన్ లో అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం
- September 12, 2022
బహ్రెయిన్ : అక్టోబర్ 25, 2022న పాక్షిక సూర్యగ్రహణం ఉందని బహ్రెయిన్ ఖగోళ శాస్త్రవేత్త, పరిశోధకుడు అలీ మజీద్ అల్-హజ్రీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇది రెండో పాక్షిక సూర్యగ్రహణమన్నారు. దీనిని ఐరోపాలోని అధిక భాగం, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని పశ్చిమ ప్రాంతాల నుండి స్పష్టంగా చూడవచ్చన్నారు. బహ్రెయిన్‌లో గ్రహణం 2 గంటల 18 నిమిషాల రెండు సెకన్ల పాటు ఉంటుందని అల్ హజ్రీ తెలిపారు. గ్రహణం మధ్యాహ్నం 01:32 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 02:44 గంటలకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, మధ్యాహ్నం 03:55 గంటలకు ముగుస్తుందని అల్ హజ్రీ తెలిపారు. బహ్రెయిన్ లో చివరి పాక్షిక సూర్యగ్రహణం డిసెంబర్ 26, 2019న వచ్చిందని అల్ హజ్రీ గుర్తు చూశారు. అలాగే నవంబర్ 8, 2022న చంద్రగ్రహణాన్ని కూడా బహ్రెయిన్ వాసులు చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య







