టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన..

- September 12, 2022 , by Maagulf
టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన..

అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.యువ సంచలనం ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాకు ఇందులో అవకాశం దక్కింది. గాయం కారణంగా కొద్దిరోజులపాటు ఆటకు దూరంగా ఉన్న పేసర్‌ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. అయితే, మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.స్టాండ్‌ బై ప్లేయర్లుగా మహమ్మద్‌ షమి, శ్రేయాస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌, దీపక్‌ చాహర్‌ను ఎంపిక చేసింది.

జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com