‘బిగ్’ టార్గెట్: ఇనయాదే తప్పంటున్నారంతా.!
- September 12, 2022
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ స్టార్ట్ అయ్యి వారం రోజులు కావస్తుంది. ఈ వారంలోనే ఎంటర్‌టైన్‌మెంట్ పేరు చెప్పి బిగ్‌బాస్‌లో జరగాల్సిన అరాచకాలన్నీ జరిగిపోతున్నాయ్. గ్రూపులు కట్టేయడం, టార్గెట్ చేసేయడం, ఇలా ఒక్కేటమిటి.. బిగ్‌బాస్ రచ్చ అంతా ఇంతా కాదు.
వర్మగారి హీరోయిన్‌గా పాపులర్ అయ్యి హౌస్‌లోకి వెళ్లిన ఇనయా సుల్తానా మిగిలిని హౌస్ మేట్స్ అందరికీ టార్గెట్ అవుతోంది. ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లేందుకు జరిగే ప్రక్రియ ఎలిమినేషన్ నామినేషన్లలో ఈవిడగారు కూడా వున్నారు.
మొత్తం ఏడుగురు కంటెస్టెంట్ల ఎలిమినేషన్ లిస్టులో భాగంగా బిగ్ హౌస్ గయ్యాలీగా పేరు తెచ్చుకున్న ఇనయా సుల్తానా పేరు కూడా వుంది. హౌస్ మేట్స్‌పై కంప్లైట్లు చెప్పే క్రమంలో దాదాపు చాలా మంది (14) ఇనయాపై కంప్టైంట్లు చెప్పి, ఆమెను టార్గెట్ చేశారు.
దాంతో, ఇనయా అలిగి బెడ్ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసింది. తప్పదు కదా.. మిగిలిన కంటెస్టెంట్లు ఆమెని ఓదార్చారు. మొదటి రోజు నుంచే ఇనయా ఇలాగే టార్గెట్ అవుతూ వస్తోంది. నిజానికి ఫస్ట్ ఎలిమేనేషన్ ఇనయాదే అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ, అనూహ్యంగా ఫస్ట్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు హోస్ట్ నాగార్జున. అలా ఈ వారం సేవ్ అయిపోయింది ఇనయా సుల్తానా.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..