సౌదీలో చట్టవిరుద్ధంగా అబార్షన్లు. ప్రవాస మహిళా డాక్టర్ అరెస్ట్
- September 13, 2022
సౌదీ: రియాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ మెడికల్ కాంప్లెక్స్‌లో అక్రమంగా అబార్షన్లు చేస్తోన్న ప్రవాస మహిళా డాక్టర్‌ను భద్రతా అధికారులు అరెస్టు చేశారు. కింగ్‌డమ్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి అబార్షన్‌లు జరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) అధికారుల తనిఖీ బృందాలు గుర్తించాయి. కనీస వైద్య, ఆరోగ్య నియమాలు పాటించకుండా అబార్షన్లు చేస్తున్న డాక్టర్ పై ఫిర్యాదు అందడంతో మంత్రిత్వ శాఖ అధికారులు క్లినిక్‌ని తనిఖీ చేశారు. మొదటగా కస్టమర్‌గా నటిస్తూ ఒక అధికారి డాక్టర్‌తో రహస్య చర్చలు జరిపారు. SR8000 చెల్లించిన వెంటనే అబార్షన్ చేసేందుకు డాక్టర్ అంగీకరించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం MoH బృందాలు భద్రతా అధికారులతో కలిసి క్లినిక్ పై దాడి చేసి డాక్టర్, ఆమె మహిళా సహాయకురాలిని అరెస్ట్ చేశారు. అబార్షన్ కోసం ఉపయోగించే గడువు ముగిసిన వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు MoH తనిఖీ బృందాలు తెలిపాయి. హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ ప్రాక్టీస్ చేసే చట్టంలోని ఆర్టికల్ 28ని ఉల్లంఘించినందుకు మహిళా డాక్టర్, ఆమె అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయబడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితులకు ఆరు నెలలకు మించని జైలు శిక్ష లేదా SR100000 కంటే ఎక్కువ జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని భద్రతాధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ పరిధిలోని ఉల్లంఘనల గురించి 937 నంబర్‌లో ఫిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







