ప్రభుత్వ స్కూళ్ల విస్తరణ. నర్సరీల్లో కిండర్ గార్డెన్
- September 13, 2022
యూఏఈ: ప్రభుత్వ పాఠశాలలను విస్తరించాలని సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశించారు. విద్యార్థులను నేరుగా ఫస్ట్ గ్రేడుకు క్వాలఫై అయ్యే విధంగా అన్ని పాఠశాలలో కిండర్ గార్టెన్ ను నర్సరీ దశలో ప్రవేశపెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే విధంగా అల్ మేడమ్‌లోని “ఖలీఫా అల్ హంజా” పాఠశాలను విస్తరించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని విద్యా స్థాయిలను ప్రవేశపెట్టాలని షార్జా పాలకుడు ఆదేశించారు. అలాగే పౌరులకు 20% తగ్గింపును ఇవ్వాలని పాఠశాల చైర్మన్ డాక్టర్ సయీద్ ముసాబా అల్ కాబీ కు సూచించారు. షార్జా ఎడ్యుకేషన్ కౌన్సిల్, షార్జా బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ నిర్వహించిన “డైరెక్ట్ లైన్” కార్యక్రమంలో ముహమ్మద్ అల్ ఖాసిమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా "డైరెక్ట్ లైన్" కార్యక్రమం దిబ్బా అల్-హిస్న్‌లోని అల్ "ఖవాసిమ్ ఫోర్ట్"తోపాటు షార్జాలోని 3 పురాతన కోటలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







