షిర్డీ సాయిబాబా సంస్థాన్ ధర్మకర్తల బోర్డు రద్దు
- September 13, 2022
షిర్డీ: ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయానికి చెందిన ధర్మకర్తల బోర్డును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఈ బోర్డును నియమించారు.
మరోవైపు వచ్చే 8 వారాల్లోగా కొత్త ధర్మకర్తల మండలిని నియమించాలని హైకోర్టు బెంచ్ ఆదేశించింది.
నిబంధనల మేరకు ధర్మకర్తల మండలిని నియమించలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మొదట ఎన్సీపీ ఎమ్మెల్యే అశుతోష్ కాలేను బోర్డు అధ్యక్షుడిగా నియమించి.. మరికొందరిని ట్రస్ట్ సభ్యులను చేశారని పిటిషన్ దారులు తమ పిటిషన్లలో తెలిపారు. ఇవాళ (మంగళవారం) పిటిషన్లను విచారించిన ఔరంగాబాద్ బెంచ్ ధర్మకర్తల బోర్డును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష