ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు..
- September 13, 2022
ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో మొదటిసారి బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకలకు రావాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25న తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సదరు సంస్థ అధ్యక్షులు డాక్టర్ శాంతిరెడ్డి, ఎమ్మెల్సీ కవితను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో పలువురు ఆస్ట్రేలియన్ ఎంపీలు కూడా పాల్గొననుండడం గమనార్హం.
దసరా పండగ వస్తుందంటే చాలు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ఖ్యాతి ఖండాతరాల్లో కూడా వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం మరోవైపు కవిత కోవిడ్ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. మరి ఆ టైం కల్లా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంటె పాల్గొంటారు కావొచ్చు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







