ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలో..

- April 17, 2016 , by Maagulf
ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలో..

ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటుచేయనున్నారు. ఎయిర్‌పోర్టులోని మూడో టర్మినల్‌ వద్ద ఈ చరఖాను పెట్టనున్నారు. భారత అహింసా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు దీన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ చరఖా తయారీ పనులు పూర్తవగా.. త్వరలోనే దీన్ని ఎయిర్‌పోర్టుకు తీసుకురానున్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌(కేవీఐసీ) యూనిట్‌లో ఈ చరఖాను రూపొందించారు. నాలుగు టన్నుల బరువున్న ఈ చరఖాను పూర్తిగా టేకుతో తయారుచేశారు. 26 మంది వర్కర్లు, కార్పెంటర్లు కలిసి 40 రోజుల్లో దీన్ని పూర్తిచేసినట్లు కేవీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com