ఇంకా ఏదో మిగిలే ఉంది

- April 17, 2016 , by Maagulf

మూల్గుతూ 
ఆయాసపడుతూ
పారిపోతున్న గాలి

దారిని  కప్పేసిన  పొడవైన  చీకటి
నిశ్చలనమై
నిదురలోకి జారుకున్న అడుగులు

పసరు మందు  పూయలేని  లోతుల్లో 
ఓ గాయం
పడమటి పొద్దులా వెలుగుతూ

అప్పుడప్పుడు
వినిపించడానికో కనిపించడానికో
నింగి నేల మధ్య ఊగిసలాడుతూ
మొహమాటపడుతున్న  కొన్ని నిజాలు

“ఎవరక్కడ?”
ఓ శాసనం ఉరిమినట్లు మెరిసింది

దిక్కులన్నీ  ఏకమయ్యాయి !

“ఎవరూ  లేరిక్కడ
ఉన్నవాళ్ళు
ఉండాల్సినవాళ్ళు
అందరూ  సమాధుల్లోనే

అనుభవించడానికి
ఆస్వాదించడానికి
ఏవీ  లేవిక్కడ
అన్నీ సమాధుల్లోనే “

సమాధులింకా  బతికే  ఉన్నాయి
ఇంకా ఏదో మిగిలే ఉంది !
       
శిలాఫలకం  ఇటువైపే  చూస్తోంది !!

 

--పారువెల్ల (దుబాయ్)
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com