శర్వానంద్ 25వ చిత్రాన్ని వైవిధ్యభరితం
- April 17, 2016
వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ఇటీవల ఎక్స్‌ప్రెస్ రాజా అనే చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. ఈ మూవీ శర్వానంద్‌కు 24వ చిత్రం. ఇక తాజాగా తన 25వ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథతో అత్యద్భుతంగా రూపొందించాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో భారీ చిత్రాల నిర్మాత బివీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి తన 25వ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.రన్ రాజా రన్, మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో వరుస సక్సెస్ లు సాధించిన శర్వానంద్ తన తర్వాతి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేయాలనుకుంటున్నాడట. అయితే ఎన్టీఆర్ 25వ చిత్రం నాన్నకు ప్రేమతోకు నిర్మాతగా వ్యవహరించిన బివీఎస్ఎన్ ప్రసాద్ శర్వానంద్ 25వ చిత్రం నిర్మించడం విశేషం.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







