బహ్రెయిన్ లో సెప్టెంబర్ 15 నుండి కొత్త పర్యావరణ చట్టం
- September 15, 2022
మనామా: సెప్టెంబర్ 15 నుండి పర్యావరణంపై 2022 చట్టం (7) అమలులోకి వస్తుందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (SCE) ప్రకటించింది. కొత్త పర్యావరణ చట్టం ద్వారా పర్యావరణాన్ని, దాని మూలాలను కాలుష్యం నుంచి కాపాడటంతోపాటు జీవవైవిధ్యం క్షీణతకు కారణమయ్యే అన్ని కార్యకలాపాలను అడ్డుకొని పర్యావరణాన్ని రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కౌన్సిల్ పేర్కొంది. పర్యావరణ వనరులను సంరక్షించడం, బహ్రెయిన్ రాజ్యం ప్రాదేశిక సరిహద్దులలో స్థిరమైన అభివృద్ధి, జీవవైవిధ్యం లక్ష్యాలను అందించడానికి వాటిని అభివృద్ధి చేయడం కూడా చట్టం లక్ష్యంగా ఉందని కౌన్సిల్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ శాఖల మధ్య ఫలవంతమైన సహకారం ద్వారా పర్యావరణ ముసాయిదా చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. పర్యావరణ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింత సహకారం అందించాలని అన్ని సంబంధిత పార్టీలు, కంపెనీలను కౌన్సిల్ కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







