రోడ్డుపై ఆగిన మహిళ కారు. మానవత్వం చాటుకున్న యూఏఈ సైన్యం
- September 15, 2022
యూఏఈ: యూఏఈ సాయుధ దళాల సిబ్బంది హైవేపై చిక్కుకుపోయిన ఓ మహిళ కారు టైరును మార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేశారు. షేక్ సైఫ్ బిన్ జాయెద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ కు చెందిన మహిళ కారు రోడ్డుపై చెడిపోయిందని, దాన్ని యూఏఈ సాయుధ దళాల సిబ్బంది గుర్తించి సాయం అందించి మానవతను చాటుకున్నారని పేర్కొన్నారు. ఆ వీడియోలో సదరు కారు యజమాని అయిన పాకిస్థానీ మహిళా స్పందిస్తూ.. ప్రతి ఒక్కరికి యూఏఈ సైన్యం సహాయం చేస్తుందని, తమకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సైన్యానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఘటన అబుదాబిలో జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని యూఏఈ అధికారులు నివాసితులను కోరారు. ప్రత్యేకించి సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వారి వాహనాలను తనిఖీ చేసుకోవాలని పిలుపునిచ్చారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో ప్రమాదాలను నివారించేందుకు టైర్ల భద్రతతో పాటు, రహదారిపై నిర్దేశించిన వేగ పరిమితులను పాటించేలా డ్రైవర్లను ప్రోత్సహించడం, అవగాహన కల్పించడం లక్ష్యంగా వేసవి ప్రచారాలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







