దాసరి అరుణ్ స్కెచ్ వర్క్ అవుతుందో లేదో చూడాలి...
- April 17, 2016
సినిమా ఇండస్ట్రీ లో పైకి రావడానికి బ్యాక్ గ్రౌండ్ గానీ గాడ్ ఫాథర్ గానీ లేకుండా రాణించడం చాలా కష్టమైన విషయం. అప్పట్లో అది పాజిబుల్ అయ్యింది కానీ ఇండస్ట్రీ కబంద హస్తాలలోకి వెళ్ళిపోయాక జరిగే పనైతే కాదు, ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా దారుణంగా ఫెయిల్ అయిన హీరోలు కూడా ఉన్నారు దానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు గారి పుత్ర రత్నం దాసరి అరుణ్. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకుండా అతను దాదాపు పదేళ్ళ క్రితమే ఇండస్ట్రీ లోంచి వెళ్ళిపోయాడు .ప్రస్తుతం నిర్మాత అయ్యే ఆలోచనలో ఉన్న ఇతను ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురుకొంటున్న వారిని పిలిచి తనతో సినిమా తీయాలి అని కోరుతున్నాడు అంటున్నారు. నిర్మాణానికి అయ్యే ఖర్చు తానే పెట్టుకుని నిర్మాతగా మాత్రం అవతలి వ్యక్తి పేరు వేస్తాడు అంటే ఇదొక షాడో ప్రొడ్యూసర్ , గోస్ట్ నిర్మాతగా చేసే పని అనమాట. డబ్బులు తనవే అయినప్పుడు తన పేరే వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక కిటుకు ఉంది. నిర్మాతలు తనతో సినిమాల కోసం వెంట పడుతున్నారు అనే ఫీలింగ్ జనాలలో సృష్టించడం కోసం అరుణ్ ఈ రకమైన ప్లాన్ వేసాడు. ఇంతకీ ఇతని స్కెచ్ వర్క్ అవుతుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







