‘శాకినీ ఢాకినీ’ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది.!
- September 15, 2022
రెజీనా కసండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘శాకినీ ఢాకినీ’. కొరియన్ మూవీకి రీమేక్‌గా రూపొందింది ఈ సినిమా. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. కాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ కాన్సెప్ట్‌ని చొప్పించారట.
రీమేక్ మూవీనే అయినా ఆ కాన్సెప్టు ఈ సినిమాకి చక్కగా సూట్ అయ్యిందనీ అంటున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమాని కమర్షియల్ అంశాలు జోడించి రూపొందించారు. రీమేక్ మూవీనే అయినా, కాన్సెప్ట్ మాత్రమే తీసుకున్నారట. పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సినిమాని రూపొందించారట.
రీసెంట్గా జరిగిన ఓ నేరానికి సంబంధించిన అంశాన్ని ఈ సినిమాలో ప్రస్థావించారట. అదే సినిమాకి కీలకం అని చెబుతున్నారు. ఆ నేరాన్ని పరిష్కరించే ట్రైనీ పోలీసులుగా నివేదా, రెజీనా నటిస్తున్నారు. ఓ మహిళ సమస్యను మరో మహిళే చెబితేనే అర్ధమవ్వాల్సిన విధంగా అర్ధమవుతుందనీ, అందుకే ఈ సినిమాని పూర్తిగా మహిళల కోణంలో తీశామనీ చిత్ర నిర్మాత తాటి సునీత చెబుతున్నారు.
సీరియస్ కాన్సెప్ట్ అయినా, కాస్త కామెడీ టోన్‌లో చెప్పామనీ, అలాగే, సెంటిమెంటల్‌గా ఈ సినిమా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందనీ ఆమె పేర్కొన్నారు. ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయ్. శుక్రవారం ‘శాకినీ ఢాకినీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







