‘నేను మీకు బాగా కావల్సినవాడిని’ అంటున్న కిరణ్ అబ్బవరం

- September 15, 2022 , by Maagulf
‘నేను మీకు బాగా కావల్సినవాడిని’ అంటున్న కిరణ్ అబ్బవరం

‘రాజావారు రాణివారు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కుర్రోడు కిరణ్ అబ్బవరం. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ కుర్ర హీరో ఇండస్ర్టీ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు. అలాగే తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకున్నాడు.
‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’, ‘సమ్మతమే’, ‘సెబాస్టియన్’ తదితర సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘నేను మీకు బాగా కావల్సినవాడిని’ అంటున్నాడు. అదేనండీ కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా టైటిలే ఇది. ఈ సినిమా ఈ శుక్రవారమే అనగా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నాడు కిరణ్ అబ్బవరం. కోడి రామకృష్ణ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందడం చాలా ఆనందాన్నిచ్చిందని కిరణ్ తెలిపాడు. అలాగే, ఈ సినిమాలో కాస్త మాస్ అప్పీల్ చూపించబోతున్నాడట కిరణ్ అబ్బవరం. 
అంతేకాదు, సినిమా మొదటి నుంచి, చివరి వరకూ ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నాడు. సినిమా చూస్తున్నంత సేపూ కడుపుబ్బా నవ్వుకుంటారట. రివ్యూ చూసి సినిమాలకు వెళ్లే ఈ రోజుల్లో తన సినిమాని మాత్రం ధియేటర్లో చూసి బాగుంటేనే మరో పది మందికి చూడమని చెప్పమని చెబుతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇదేదో లలితా జ్యూయలరీ కిరణ్ ప్రమోషన్‌ని తలపించట్లా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com