ఓ చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ..
- April 17, 2016
కాన్పూర్: నిండా పదేళ్లు కూడా నిండని ఓ చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. అది కూడా ఏవైనా సమస్యల గురించా అంటే కానే కాదట. ప్రధాని మోదీ పాలనను మెచ్చుకుంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి లేఖ రాసింది.కాన్పూర్‌కు చెందిన అదితి అనే చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. ప్రభుత్వ పథకాలు, పాలనపై ఈ లేఖలో ప్రశంసల జల్లు కురిపించింది. దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రారంభిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ చిన్నారి ఉత్తరానికి ప్రత్యుత్తరం కూడా వచ్చిందట. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి ఈ విషయాన్ని తెలిపింది. తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి థాంక్యూ అంటూ లేఖ వచ్చిందని.. అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. భవిష్యత్తులో మోదీ పథకాలపై మరిన్ని లేఖలు రాస్తానని చెబుతోంది అదితి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







