జెడి చక్రవర్తి ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు
- April 17, 2016
నటుడు జెడి చక్రవర్తి ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు ఎంతో తెలుసా..... అక్షరాల 46 సంవత్సరాలు. మరో నాలుగేళ్లు పోతే హాఫ్ సెంచరీ క్రాస్ అయ్యేవాడు. ఇపుడు కూడా వాళ్ల అమ్మ బలవంతం మీద పెళ్లి చేసుకోబోతున్నాడట.ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని జేడీ పెళ్లి చేసుకోనున్నాడు. మరికొన్ని నెలల్లో ఈ పెళ్లి జరగనుంది. 'నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత - మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నా' అంటున్నాడు జేడీ చక్రవర్తి జేడీ చక్రవర్తి అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. అమ్మ కర్ణాటక సింగర్ శాంత. తండ్రి నాగులపాటి సూర్యనారాయణ రావు. సెయింట్ జార్జ్ గ్లామర్ స్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేసాడు. తర్వాత చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బి.ఇ పూర్తి చేసాడు.సినిమా రంగం మీద ఆసక్తితో 1989లో వచ్చిన రామ్ గోపాల్ వర్మ మూవీ శివతో అరంగేట్రం చేసిన చక్రవర్తి తర్వాత హీరోగా, విలన్ గా, దర్శకుడిగా ఎదిగాడు. 'సత్య' మూవీతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







