నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు...

- April 17, 2016 , by Maagulf
నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు...

వరుస సినిమాలతో దూసుకొస్తున్న నిఖిల్.. 'టైగర్' హిట్‌తో దూకుడుమీదున్న వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. విభిన్న కథ, కథనాలతో రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. హేభాపటేల్, అవికాగోర్ ఇప్పటికే ఎంపికచేసిన చిత్రయూనిట్ మూడో హీరోయిన్‌గా తమిళ నటి నందితా శ్వేతను ఎంపిక చేశారు. తమిళంలో పలు సినిమాలతో అలరించిన కోలీవుడ్ బ్యూటీ నిఖిల్ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'అమల' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com