135 కుటుంబాలకు మున్సిపల్ ఫీజు తగ్గింపు
- September 18, 2022
మనామా: అద్దె ఇళ్లలో నివసిస్తున్న 135 బహ్రెయిన్ కుటుంబాలకు ఆగస్టు నెల మున్సిపల్ ఫీజును తగ్గించారు. ఈ మేరకు మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు భవిష్యత్తులో రుసుము చెల్లించకుండా లేదా వారు చెల్లించని అప్పులను మినహాయించడం ద్వారా పౌరులందరికీ మంచి జీవనాన్ని అందించాలనే హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నిర్ణయం మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి నాసర్ అల్ ముబారక్ తెలిపారు. పౌరుల ఆకాంక్షలను సాధించడానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు అల్ ముబారక్ పేర్కొన్నారు. పౌరుల అవసరాలు, జీవన పరిస్థితులకు అనుగుణంగా పురపాలక రుసుములను తగ్గించడం ద్వారా పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని అల్ ముబారక్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







