సౌదీలో 168 కిలోల షాబౌ ప‌ట్టివేత‌

- September 18, 2022 , by Maagulf
సౌదీలో 168 కిలోల షాబౌ ప‌ట్టివేత‌

సౌదీ: సౌదీ వ్యాప్తంగా 168 కిలోల కంటే ఎక్కువ మెథాంఫేటమిన్ (షాబౌ) అక్రమ రవాణాను అడ్డుకున్న‌ట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్ర‌క‌టించింది. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు సూట్‌కేస్‌లో దాచిన 6 కిలోల కంటే ఎక్కువ షాబౌను కస్టమ్స్ అధికారులు ప‌ట్టుకున్న‌ట్లు ZATCA పేర్కొంది. అలాగే అల్-బత్‌హా ఓడరేవులో ట్రక్కులో టిష్యూ బాక్సులలో దాచి త‌ర‌లిస్తున్న‌ 10కిలోలకుపైగా షాబౌను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనితోపాటు జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో  ప్రయాణికుడి సూట్‌కేస్‌లో దాచిన సుమారు 5 కిలోల షాబౌను క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్టీ క్వార్ట‌ర్‌ పోర్ట్‌లో వాహన ఇంధన ట్యాంక్‌లో దాచి త‌ర‌లిస్తున్న‌ దాదాపు 147 కిలోల షాబౌను క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అథారిటీ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com