ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు..

- September 19, 2022 , by Maagulf
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు..

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం పది చోట్ల ఈడీ బృందాలు సోదా చేస్తున్నాయి. 3 ఐటీ కంపెనీలతో పాటు 2 రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది ప్రత్యేక అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహిస్తోంది. కరీంనగర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నివాసంతో పాటు రామంతాపూర్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగుతోన్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో చాలామంది పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ దాడుల్ని కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 16న దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఢిల్లీతోపాటు పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.

మద్యం పాలసీ కేసులో (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. మూడు నెలల క్రితం మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా సత్యేంద్ర తెలిపిన సమాచారం మేరకు లిక్కర్‌ స్కామ్‌లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఆగస్టులో కూడా వివిధ ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ, హైదరాబాద్, నెల్లూరు,బెంగళూరు, మంగళూరు, చెన్నైలలో ఈడి సోదాలు నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com