రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయని కార్మికులపై పరారీ కేసులు
- September 19, 2022
కువైట్: వర్క్ పర్మిట్లతో దేశంలోకి వచ్చి రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయని ప్రవాస కార్మికులపై పరారీ కేసులను నమోదు చేయడానికి "ఆశల్" పోర్టల్‌లో కొత్త ఫీచర్ ను ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) తెలిపింది. రెసిడెన్సీ విధానాలను పూర్తిచేయని వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకోవడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ పేర్కొంది. ఇప్పటివరకు నమోదైన దాదాపు 1,000 పరారీ కేసులను తనిఖీ విభాగం అధ్యయనం చేస్తోందని పీఏఎం తెలిపింది. సాధారణంగా తనపై నమోదైన ఫిర్యాదుపై రెండు నెలలలోపు అభ్యంతరం చెప్పే హక్కును కార్మికుడికి చట్టం ఇస్తుంది. రెండు నెలల గడువు ముగిసిన తర్వాత సదరు కార్మికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఫైల్ రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగానికి బదిలీ అవుతుంది. అక్కడ రెసిడెన్సీ విధానాలు పాటించని కార్మికుడిని దేశం నుంచి బహిష్కరణతో సహా ఇతర చర్యలను అంతర్గత మంత్రిత్వ శాఖ తీసుకునే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







