పోలీస్ స్టేషన్పై దాడి.. నిందితుల కోసం ముమ్మర గాలింపు
- September 19, 2022
కువైట్ సిటీ: సులైబియా పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడి, భద్రతా సిబ్బందిని గాయపరిచిన ఏడుగరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల దాడితోపాటు వారు పారిపోయిన కారు దృశ్యాలు సీపీ ఫుటేజీలో రికార్డు అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడి ఘటనను పోలీసులు వివరించారు. కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ వ్యక్తిపై సాయుధులైన ఏడుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, ఈ క్రమంలో బాధితుడిని రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా నిందితులు దాడికి దిగారని తెలిపారు. ఈక్రమంలో ఓ పోలీసు చేతికి తీవ్ర గాయమైందని, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితులను హెచ్చరించేందుకు వార్నింగ్ గన్ ఫైర్ చేయడంతో నిందితులు అక్కడినుంచి పారిపోయారని వివరించారు. నిందితులను గుర్తించామని త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







