మనం కూర్చుంటున్న విధానాల గురించి ముందు పరిశీలిద్దాం..
- April 17, 2016
మనం కూర్చుంటున్న విధానాల గురించి ముందు పరిశీలిద్దాం. మన చుట్టూ కొన్ని వందల సంవ త్సరాల నుంచి రకరకాల కుర్చీలువస్తున్నాయి. కానీ అన్ని కుర్చీల్లోనూ కూర్చోవటం ఎంతవరకు మంచిది? చాలామంది రోజులో గంటల కొద్ది సమయాన్ని కూర్చో వడానికే కేటాయిస్తారు. అది పనిప్రదేశంలో కావచ్చు, ఇంటిదగ్గర కావచ్చు. వాహనంమీద కావచ్చు - ఎక్క డైనా సరిగ్గా కూర్చోకపోతే వెన్ను మీద అదనపు భారం పడుతుంది. దాంతో వెన్నునొప్పి వచ్చి మనల్ని బాధ పెడుతుంది.గుంటలా ఉండి వెనుక కొంతవరకు అను కోవడానికి ఉపయోగించే కుర్చీలు మనకి సౌకర్యంగా అనిపించవచ్చు. కానీ వాటివల్ల కూర్చున్నఫ్రదేశంలో ఇబ్బంది లేకపోయినా వెన్నుమీద ఒత్తిడి పడవచ్చు. మెడవరకు కుర్చీలో తిన్నగా ఆనుకోవడానికుంటే వెన్ను అంతగా ఇబ్బంది పడకపోవచ్చు.
ముందుకి ఒంగి కూర్చోవటం వల్ల కడుపు ప్రాంతంలో ఒత్తిడి కలుగవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మని చూడండి ఆభంగిమ గురించి తెలుసుకోండి. -మొదటిది నడుం మీద ఒత్తిడి పడుతుంటుంది. వెన్నుమీద, ప్రేగుల మీద, కడుపుమీద, మూత్రపిండాల మీద, ఎడ్రిన ల్గ్లాండ్స్ మీద, ఉదరవితానం మీద, ఛాతిమీద, మెడ, గొంతుల మీద కూడా ఒత్తిడి పడవచ్చు. దంతాల మీద కూడా ఒత్తిడి పడవచ్చు. దానిని నివారించడం అవసరం.పొట్టకి, తొడకి మధ్య కనీసం 135 డిగ్రీలు ఉండాలి. అలాగే తొడభాగం అంతటికి, కింద పూర్తి ఆధారం ఉండాలి. రెండు పాదాసలూ నేలకు ఆనాలి. నడుంకి కూడా ఆధారం ఉండాలి. ఇలాంటి కూర్చోవడానికి వీలున్న కుర్చీలు మంచిది. ఎదురుగా కంప్యూటర్ గాని, టీవిగాని ఉంటే కళ్ళస్థాయి కంప్యూట్ లేక టీవి పై స్థాయికి సమంగా ఉండాలి. కాళ్ళుని క్రాస్చేసి కూర్చోవడం, అలాగే చతికిల బడి కూర్చోవడం మంచిది కాదు. కూర్చున్నప్పుడు తొడకంటే మోకాలు పైకి ఉండకూడదు. ఇందాక చెప్పినట్లు 135 డిగ్రీలు ఉండేట్లు తప్పక చూసుకోవాలి. ఇలా ఇంటిదగ్గరైనా, కార్యాలయాలలో అయినా మంచిది. కారులో కూర్చు న్నప్పుడు కూడా ఈ పద్దతినే అవలంభించాలి.ఇంట్లో కొంతమంది పొడుగాటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పొట్టివాళ్ళు ఉండవచ్చు. కానీ కుర్చీలు కొనేటప్పుడు పొట్టివాళ్ళను బేస్ చేసుకొని కొంటే మంచిది. ఖచ్చితంగా చూడాలి అంటే ఎవ్వరి ఎత్తుకు తగ్గట్లు వారికి కుర్చీలు ఉండటం మంచిది. ఇళ్ళల్లో అందరికీ అది వీలు కాదు కాబట్టి తక్కువ ఎత్తున్న వాళ్ళని ఆసరగా చేసుకొని కుర్చీలు కొనుక్కోవటం మంచిది.కుర్చీల గురించే కాకుండా మనందరం తీసుకోవాల్సిన మరో జాగ్రత్త ఉంది. అదేంటంటే ఇంటి దగ్గర కావచ్చు, కార్యాలయాల్లో కావచ్చు, బండిమీద కావచ్చు మరెక్కడైనా కావచ్చు అలాగే కూర్చొని ఉండకుండా కనీసం గంటకు ఒకసారి లేచి ఒక అయిదు నిమిషాల పాటు ఆప్రాంతంలోనే కొద్దిగా నడవటం, శరీరాన్ని సాగదీసుకోవడం మంచిది. ఇలా మధ్యమధ్య చేయకుండా అలాగే గంటలకొద్దీ కూర్చోవడం మంచిదికాదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







