గృహ కార్మికుల వార్షిక లెవీని పాక్షికంగా రద్దు చేసే యోచనలో సౌదీ ప్రభుత్వం
- September 20, 2022
సౌదీ: సౌదీ లో ఉండే వ్యక్తులు తమ ఇళ్లలో పనిచేసేందుకు పెట్టుకునే కార్మికులకు సంబంధించి వార్షికంగా లెవీ చెల్లిస్తుంటారు. ప్రవాస యాజమానులైతే ఇద్దరికి మించి ఎక్కువ మంది పనివాళ్లను పెట్టుకుంటే వారిపై ఒక్కొక్కరికి ఏడాదికి 9, 600 ల రియాల లెవీ చెల్లిస్తారు. సౌదీ లో ఉండే యాజమానులకైతే నలుగురు కార్మికుల వరకు మినహాయింపు ఉంది. అంతకన్నా ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటే వారిపై ఏడాదికి లెవీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే 22 నుంచి మొదటి దశ లెవీని వసూలు చేస్తున్నారు. రెండో దశ ఉండే విధివిధానాలతో వచ్చే ఏడాది లెవీ వసూలు చేయనున్నారు. ఐతే సౌదీ పౌరులకు సెలక్టివ్ గా ఈ లెవీని కనీసం పాకిక్షంగానైనా రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ డిమాండ్ ను పరిశీలించేందుకు అంగీకరించింది. ఈ విధానం ఎలా ఉండాలన్న దానిపై శౌరా స్డడీ చేయాలని శౌరా కౌన్సిల్ కోరింది. సోమవారం కౌన్సిల్ సభ్యులతో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మిషాల్ అల్-సులామీ వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లెవీకి సంబంధించి స్టడీ చేయాలని ఆదేశించారు. ఇదే జరిగితే సౌదీలో ఉండే ఇంటి యాజమానులకు కాస్త రిలీఫ్ దక్కనుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







