ఫుడ్ డెలవరీ బాయ్స్ బైక్ ప్రమాదాలను తగ్గించటంపై ట్రాఫిక్ పోలీసుల ఫోకస్
- September 20, 2022
దోహా: ఫుడ్ డెలవరీని ఆన్ టైమ్ లో డెలవరీ చేయాలన్న ఆతృతతో చాలా మంది డెలవరీ బాయ్స్ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. దీంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (జీడీటీ), ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది. రెండు డిపార్ట్ మెంట్ లు కలిసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వర్క్‌షాప్ నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ అవేర్‌నెస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ జాబర్ మహ్మద్ రషీద్ ఒడైబా ఖతార్ రేడియోలో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఫుడ్ డెలవరీ చేసే బాయ్స్ సంఖ్య పెరిగిందన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని అయితే రోడ్డు ప్రమాదాలు కూడా పెరగటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకే వర్క్ షాప్ ఏర్పాటు చేసామన్నారు. చాలా మంది లోకేషన్ తెలుసుకునేందుకు మొబైల్ యాప్ చూస్తూ డ్రైవింగ్ చేయటం, ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం కారణంగా ప్రమాదాలు జరగుతున్నాయన్నారు. 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2022 మొదటి త్రైమాసికంలో మూడు రెట్ల ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని...డెలివరీ బాయ్స్ కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







