లులూ హైపర్ మార్కెట్ లో 'ఇండియా ఉత్సవ్' సెక్షన్ ను ప్రారంభించిన మంత్రి పీయూష్ గోయల్
- September 20, 2022
రియాద్: భారత్ కు చెందిన లులూ హైపర్ మార్కెట్ చైన్ సంస్థ అరబ్ దేశాల్లో పెద్ద ఎత్తున సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. అరబ్ దేశాల్లో లులూ సూపర్ మార్కెట్లకు మంచి పేరుంది. ఈ సంస్థ తాజాగా మురబ్బాలోని రియాద్ అవెన్యూ మాల్ లో "ఇండియా ఉత్సవ్" పేరుతో కొత్త సెక్షన్ ను ఏర్పాటు చేసింది. ఈ సెక్షన్ ను భారత వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ తో కలిసి ప్రారంభించారు. భారత్ కు చెందిన ఫుడ్ అండ్ టెక్స్ టైల్స్ ప్రొడెక్స్ట్ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు ఇటీవల వాణిజ్య శాఖ క్యాంపెయిన్ ప్రారంభించింది. అదే విధంగా 2023 ను "ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్" గా ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా భారత తృణ ధాన్యాలకు మార్కెటింగ్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఈ కార్యక్రమంలో లులూ గ్రూప్ తమ వంతు సహకారం అందిస్తోంది. "ఇండియా ఉత్సవ్" పేరుతో ఏర్పాటు చేసిన సెక్షన్ లో దాదాపు 10 వేల ఇండియన్ ప్రొడెక్ట్స్ ను ఉంచింది. ఈ ఫోటోను మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. లులూ గ్రూప్ ను ప్రశంసించారు. అటు భారత్, సౌదీ మధ్య సంబంధాలకు తమ గ్రూప్ వారధిలా పనిచేస్తుండటం సంతోషంగా ఉందని లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ చెప్పారు. భారత ఫుడ్ ప్రాజెక్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







